WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలోని రెండో వార్డులో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎంఐఎం నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ శశిధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వార్డులో మంచినీటి సరఫరా సమస్య ఉందని, వీధుల్లో పందులు, కుక్కలు అధికంగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. రహదారులు దెబ్బతిన్నాయి మరమ్మతులు నిర్వహించాలని జావేద్ కోరారు.