KNR: విద్యుత్ షాక్తో మృతి చెందిన శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును విద్యుత్ శాఖ AD కె.శ్రీనివాస్ అందజేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ ఆర్థిక సాయం ఆ కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.