NZB: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్య తాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.