ADB: బోథ్ మండల కేంద్రంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఫైర్ ఇంజన్ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. బోథ్ మండలంలో గత పక్షం రోజులుగా వందల ఎకరాలు అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమయ్యాయి. దీంతో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని నాయకుల డిమాండ్ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.