KNR: మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలన్నారు.