TPT: గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శిరీష ఆధ్వర్యంలో శనివారం పలు శాఖల అధికారులతో బాణసంచా దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. శిరీష మాట్లాడుతూ.. 22 షాపులకు లైసెన్సులు ఇచ్చామన్నారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక, ధరల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సహకరించాలన్నారు.