MHBD: మే 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభను పురస్కరించుకొని మహబూబాబాద్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు మహబూబాబాద్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.