SRPT: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో కత్రం చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా, క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.