MLG: ‘బుల్లెట్ నుంచి బ్యాలెట్’ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘షీ స్పార్క్స్-2026’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, కాలక్రమంలో అదే కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సందర్భం తన జీవితంలో కీలక మలుపన్నారు.