SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.