ములుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి, ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం అమలు చేస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పేర్కొన్న ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.