SRPT: ఈ నెల 10న హైదరాబాద్లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు విసుగు చెందారని, 2028లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు.