BDK: టేకులపల్లి మండలం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ఆడబిడ్డలను ఆశీర్వదించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మ తర్వాత అంతటి పాత్ర వహించేది అంగన్వాడీ టీచర్ అని కొనియాడారు.