KNR: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈనెల 8 నుంచి 18 వరకు సదరం, యూడీఐడీ అంచనా శిబిరాలు నిర్వహించనున్నట్లు DRDO గీతా తెలిపారు. వివిధ రకాల వైకల్యాల నిర్ధారణ కోసం మొత్తం 628 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని దివ్యాంగులకు సమాచారం అందించి శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.