SRCL: చందుర్తి మండలంలో నూతనంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరైనట్లు ఎంఈవో వినయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని 4 పాఠశాలల్లో (ఎంగల్, నర్సింగాపూర్, జోగాపురం, సనుగుల) విద్యార్థులకు బోధించడానికి మహిళా బోధకులు, మహిళా ఆయాలను నియమించనున్నారు. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MEO తెలిపారు.