MDCL: అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం సాయిసూర్య ఎంక్లేవ్ ఫేజ్-2లో ఉన్న శ్రీ నగరేశ్వరస్వామి సమేత వాసవి మాత దేవాలయంలో శుక్రవారం సరస్వతి సత్సంగ్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కుంకుమార్చన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు.