NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ వద్ద మంగళవారం పోలీస్ పహారమధ్య సిలిండర్లను పంపిణీ చేశారు. ఏజెన్సీకి 10 రోజుల నుంచి సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇళ్లలో సిలిండర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు. ఇవాళ స్టాక్ ఒక్కసారిగా గ్యాస్ కేంద్రానికి చేరుకోవడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.