RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ బైపాస్ గాయత్రి మిల్క్ ప్లాంట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టాటా నెక్సాన్ కారు, హీరో స్ప్లెండర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బీహార్‌కు చెందిన రోషన్ కుమార్ (24), యూపీకి చెందిన పంకజ్ (19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.