MBNR: జడ్చర్ల బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 7న ఉదయం 10 గంటలకు కొహేన్స్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించనున్నారు. బీ.ఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని ప్రిన్సిపల్ జి. సుకన్య, ప్లేస్మెంట్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాల కోసం కళాశాలను సంప్రదించాలన్నారు.