జనగామ జిల్లా కురుమ సంఘం, ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న చుక్క సత్తయ్య జయంతి ఉత్సవాల పోస్టర్లను ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాలకు విచ్చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంఘం సభ్యులకు ఐలయ్య సూచించారు.