SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో యోగాపై కలెక్టర్ గరీమ అగ్రవాల్ శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు అరగంట నుంచి గంట సమయం పాటు వ్యాయామం యోగ సాధన చేయాలని కోరారు.