ఆసిఫాబాద్ జిల్లాలో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని SP నితికా పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డయల్-100కు త్వరితగతిన స్పందించాలన్నారు. గంజాయి, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.