SDPT: జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వస్తున్న బస్సులో హైదరాబాద్‌కు చెందిన చంద్రిక తన బ్యాగును మరిచిపోయింది. డ్రైవర్ మహేందర్ బ్యాగును గుర్తించి డిపో మేనేజర్‌కు అప్పగించారు. బ్యాగులో 12 గ్రాముల బంగారం (రూ.1,44,000 విలువ), 100 గ్రాముల వెండి, రూ. 3 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ మానవత్వంతో వ్యవహరించి ఆ బ్యాగును తిరిగి చంద్రికకు అప్పగించారు.