SDPT: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో విశాల సహకార పరపతి సంఘం వారిచే ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక్కడ మొక్కజొన్నను రూ.2400 కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, AMC ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నరు.