GDWL: అయిజ సింగిల్ విండో ఛైర్మన్గా పోతుల మధుసూదన్ రెడ్డి మంగళవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. గతంలో పాలకవర్గాల గడువు ముగిసిందనే కారణంతో ప్రభుత్వం ఇన్ఛార్జ్లను నియమించగా, దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం 597 జీవోను ఉపసంహరించుకోవడంతో, కోర్టు ఆదేశాల మేరకు పాత పాలకవర్గమే మళ్లీ కొలువుదీరింది.