SRPT: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడిషనల్, స్పెషల్ కలెక్టర్ల బదిలీలు నియామక ప్రక్రియలో భాగంగా సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా హరిసింగ్ నియామకం అయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీతారామారావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హరి సింగ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి.