NZB: పంటలకు పురుగు మందులను అవసరమైన మోతాదు మేరకు వినియోగించాలని కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ సూచించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో మెండోరా రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. వేపనూనె, అజాడిరక్తిన్ వంటి బయోపెస్టిసైడ్స్ను ప్రారంభ దశలో ఉపయోగించాలన్నారు.