MBNR: హోలీ పండుగ వేళ అమ్రాబాద్ మండలం మన్ననూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన కాళీ అనే యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై హనుమంత రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.