BDK: పాల్వంచ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అధికారులకు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. అందిన దరఖాస్తులను అధికారులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు.