NZB: అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని NZB రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. పంట నష్టంపై ఇప్పటికే రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. కష్టకాలంలో రైతులకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.