NRML: జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌కు చెందిన శేషగిరిరాజు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించి.. బాధితుడికి రూ.2 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఎసీ చెక్కును మంగళవారం అందజేశారు. మెరుగైన వైద్యం కోసం సహకరించిన ఎమ్మెల్యేకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.