BDK: భద్రాచలంలో శుక్రవారం ఓ ప్రేమజంట లాడ్జిలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కరకట్ట (స్మశాన వాటిక) ఆనుకొని ఉన్న లాడ్జిలో ఈ దారుణం జరిగింది. మృతుల్లో 34 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి ఉన్నారు. యువకుడిది కుకునూరు మండలం కాగా, యువతిది అశ్వాపురం మండలం అని సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.