HYD: నగరంలో అనేక పెట్రోల్ బంకులో గత కొద్ది రోజులుగా విపరీతమైన రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించాయి. కానీ, ప్రస్తుతం నగరంలో ఉప్పల్, నాచారం, అత్తాపూర్, బోడుప్పల్ , నారాయణగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్, పంజాగుట్ట, బేగంపేట లాంటి అనేక బంకుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నో స్టాక్ బోర్డులు తీసేశారు.