NRML: సారంగాపూర్ మండలం దని గ్రామంలోని అతి ప్రాచీన రాజరాజేశ్వరి ఆలయంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో బీజేపీ సీనియర్ నాయకులు విలాస్, రాజేందర్ రెడ్డి, పోతన్న, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.