MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి కేజీబీవీ పాఠశాలలో ఇవాళ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్డీవో రమాదేవి హాజరై విద్యార్థినులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని వంటశాల, వసతి గదులను తనిఖీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.