KMM: బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. నూతన సబ్ స్టేషన్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మొక్కజొన్న పొలాలకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక రైతులే స్వయంగా మంటలను అదుపు చేశారు.