KNR: కరీంనగర్ రూరల్ మండలం ముక్దంపూర్ గ్రామంలోని రైతు వేదికలో వానకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి, సిబ్బంది రైతులకు తగిన పంటల ఎంపిక, విత్తనాల నాణ్యత, ఎరువుల వినియోగం, పురుగు మందుల నియంత్రణపై సూచనలు ఇచ్చారు. వర్షాధారిత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు పాటించాలని వివరించారు.