వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (DTC)లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా నూతన బోరు బావి తవ్వక పనులకు ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రంలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశమై, పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు.