KMR: దోమకొండ మండలంలోని లింగుపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ విక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో లింగుపల్లి సర్పంచ్ పట్నం లక్ష్మీ, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.