RR: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం మూసాపేటలో మెరుపు దాడి చేసింది. ఒక గదిలో నిల్వ ఉంచిన 6.43 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.