MHBD: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో గురువారం ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ, సంక్షేమం, పని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. సిబ్బంది నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను ఎస్పీఅడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.