WGL: జిల్లా బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇవాళ నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన KFW సంస్థ ప్రతినిధులతో కలిసి రూ. 5,725.40 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) ప్రాజెక్టుపై ఆమె సమీక్ష నిర్వహించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభించి నగరాన్ని అత్యున్నత పారిశుధ్య ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని మేయర్ పేర్కొన్నారు.