SRD: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా యువ కార్మికులు ఉద్య మించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలోని కేకే భవన్లో నిర్వహించిన యువ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న యువతకు యాజమాన్యాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆరోపించారు.