BDK: చర్ల మండలం సత్యనారాయణపురంలోని,పెద్దపల్లి, ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ అంకిత్ సందర్శించారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు ఆయన తనిఖీ చేశారు.