KMR: కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు షేక్ దావూద్‌కు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. నేరం చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.