BDK: సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో మంగళవారం ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల విభిన్నీకరణ, ప్రత్యామ్నాయ సాగు అవసరమన్నారు. నీటి సంరక్షణతో సాగు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు.