PDPL: రేపు పెద్దపల్లిలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు, పెద్దపల్లి సర్కిల్ SE గంగాధర్ తెలిపారు. విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్, సెక్షన్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.