HYD: హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల తొలగింపు చర్యలు మొదలయ్యాయి. GHMC పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు సుమారు 4,800 టన్నులకు పైగా వ్యర్థాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 6,800 టన్నులకుపైగా వ్యర్ధాలు ఉండవచ్చని పేర్కొన్నారు.