NGKL: ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులకు హాజరై, త్వరగా పూర్తి చేసుకోవాలని డీఆర్డీవో చిన్న ఓబులేసు సూచించారు. మంగళవారం తుమ్మల ఇంద్రకల్, యత్మాపూర్లలో నర్సరీలు, ఉపాధి పనులను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఏపీవో చంద్ర సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.