NZB: ఎడపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.